News

గుండెపోటుతో జయలలిత అభిమాని మృతి


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వార్తలను చూసిన ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. కడలూరు జిల్లా గాంధీనగర్‌కు చెందిన జయ అభిమాని, అన్నాడీఎంకే కార్యకర్త అయిన నెలగందన్ టీవీల్లో జయలలితకు సంబంధించిన వార్తలు చూస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘అమ్మ’ ఆరోగ్యం విషమించిందని తెలియగానే నెలగందన్ కుప్పకూలిపోయాడని, ఆస్పత్రికి తరిస్తుండగానే మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.